Viral: అమ్మా నన్ను క్షమించు! మారాలని ఉన్నా.. మారలేక.. శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మత్తు పదార్ధాలకు ఒక్కసారి అలవాటు పడితే వాటినుంచి దూరం కావడం అసాధ్యం.. ప్రస్తుత కాలంలో యువత క్షణికానందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై బ్రతుకు నాశనం చేసుకుంటున్నారు. అలా చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు మానాలనుకున్నా మానలేక మానసిక ఒత్తిడితో చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తల్లికి క్షమాపణ చెబుతూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క గంగులు, సత్తయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు దుబాయికి వెళ్లగా, చిన్నకొడుకు సాయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకునే జీవనం సాగించే సాయి మద్యంతో పాటు ఇతర వ్యసనాలకు బానిస అయ్యాడు. భర్త తీరుతో విసుగు చెందిన సాయి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు మరింత దిగజారిపోయాడు. ఆ అలవాట్లను ఎంత మానుకుందామనుకున్నా అతడి వల్ల కాలేదు. దీంతో నిరాశకు లోనై ఇంట్లొ ఎవరూ లేని సమయంలొ ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. తన లాగా మత్తుకు ఎవ్వరూ బానిసలు కావద్దని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని.. యువతకి హితవు పలుకుతూ సాయి తన చివరి మాటలను సూసైడ్ లెటర్‌లో రాశాడు. సాయి రాసిన చివరి మాటలను అతడి స్నేహితులు ఫ్లెక్సీ రూపంలో గ్రామంలో ఏర్పాటు చెశారు. ఆ ఫ్లెక్సీ ఆ గ్రామంలో చర్చనీయాంశం గా మారింది. అందర్నీ ఆలోచింపజేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.