Viral: చోరీ చేస్తూ గొడవపడ్డ దొంగలు.. ఇంతకీ కారణమేంటంటే.! వీడియో వైరల్..

|

Dec 10, 2024 | 5:22 PM

సంగారెడ్డి జిల్లాలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. దొంగతనానికి వచ్చిన దొంగలు వారిలో వారే పోట్లాడుకున్నారు. వారి కొట్లాటకు కారణం అక్కడ కనిపించిన సీసీ కెమెరా. సీసీ కెమెరాను చూడకముందు రెచ్చిపోయిన దొంగలు.. అక్కడ సీసీ కెమెరా ఉందని తెలియగానే భయంతో గజగజ వణికిపోయారు. అంతేకాదు వారిలో వారే పోట్లాడుకున్నారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలం బుదేరా గ్రామంలో అశోక్ గౌడ్ అనే వ్యక్తి తన పల్సర్‌ బైక్ ను రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వెళ్ళారు. రాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు దర్జాగా బైక్‌ను చోరీ చేసేందుకు వచ్చారు. పల్సర్‌ వాహనాన్ని దొంగిలించేందుకు దాదాపు 15 నిమిషాలు శతవిధాలా ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ సీసీ కెమెరా ఉందని గుర్తించారు. ఇంకేముందు దొంగలకు చెమటలు పుట్టాయి. సీసీ కెమెరాను చూడకముందు సొంత బైక్‌ను తీసుకెళుతున్నట్లు తీసుకెళ్లజూశారు. ఇక సీసీ కెమెరా కంటపడగానే బైక్‌ను నువ్వంటే నువ్వు తీసుకెళ్లు అంటూ వారిలో వారే గొడవ పడ్డారు. చివరికి ధైర్యం చేసి ఆ బైక్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.