Viral Video: భోజనం చేస్తుండగా పొట్టపగిలి పేగులు బయటకు..! వీడియో వైరల్..

|

Jun 09, 2024 | 6:27 PM

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదర భాగంలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఉదరంపై కోతపెట్టి ఆపరేషన్ చేశారు.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదర భాగంలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఉదరంపై కోతపెట్టి ఆపరేషన్ చేశారు. అనంతరం గాయానికి కుట్లు వేశారు. ఆపరేషన్ తాలుకు గాయం నుంచి వృద్ధుడు పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తుండగా ఉదరభాగంపై తడిగా ఉన్నట్టు అనిపించింది. ఈలోపు తుమ్మూ, దగ్గు రావడంతో ఆపరేషన్ గాయం ఉన్న చోట కడుపు చిట్లి పేగులు బయటకు వచ్చాయి. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉదరం, పొత్తికడుపు భాగంలో ఆపరేషన్లు అయిన వారికి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తాలూకు గాయాలు మానకపోతే తుమ్మూ, దగ్గుతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. శస్త్రచికిత్సల తరువాత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాయాలు మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.