Viral: ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

Updated on: Oct 25, 2024 | 8:26 PM

ఈ ఘటన తన దృష్టికి రావడంతో ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. వికసిత్ భారత్‌' కోసం కృషి చేసేలా నారీ శక్తి' ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఆప్యాయత తనను కదిలిస్తోందనీ తనను ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నాననీ అన్నారు. వారి ఆశీస్సులు వికసిత్ భారత్‌ నిర్మాణం దిశగా నిరంతరం కృషి చేసేందుకు తనను ప్రోత్సహిస్తాయి అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఒడిశాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. సుందర్‌గఢ్ జిల్లాలో పార్టీ సభ్యత్వ డ్రైవ్‌ జరుగుతుండగా ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండాకి అందజేసింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేయండి అంటూ ఆమె కోరారు. రూ.100 వద్దని జైజయంత్ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. పట్టుబట్టు మరీ డబ్బు ఇచ్చి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి రూ.100 తీసుకోవాలని ఆదివాసి మహిళ పట్టుబట్టిందనీ ఆమె తన వివరణను పట్టించుకోలేదనీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. చివరకు తాను డబ్బు తీసుకునే వరకు ఆమె పట్టుబట్టిందనీ ఈ పరిణామం ఒడిశా, భారత్ పరివర్తనకు ప్రతిబింబం అని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us