రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు.. వీడియో

Updated on: Feb 10, 2025 | 12:14 AM

పీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.. 2025 జనవరి 16వ తేదీన తాము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని కనిగిరికి చెందిన రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ మూలే బ్రహ్మారెడ్డికి ఫోన్ వచ్చింది.. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ లో మాట్లాడాడు. అక్కడ ఉండే ఎస్‌ఐ శివ ప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడండి.. మీరు ఆ ఎస్ఐ ను రిక్వెస్ట్ చేసుకుంటే మీ మీద కేసు లేకుండా చేస్తారని తెలిపాడు ఆ అజ్ఞాత వ్యక్తి.. విషయం తెలుసుకుందామని ఎస్ఐ నెంబర్ కి ఫోన్ చేశాడు రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ బ్రహ్మారెడ్డి..

ఎస్‌ఐ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వాట్స్అప్ వీడియో కాల్ లోకి వచ్చి.. ఇల్లీగల్ కాంటాక్ట్ , అసభ్యకరంగా వాట్స్అప్ పోస్టులు పెట్టడంపై మీ మీద బెంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని తెలిపాడు. సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మరెడ్డి ముందుగా తన ఫోన్ పే లో నుంచి వాళ్ళ యూపీఐ నెంబర్ కి కొంత డబ్బు పంపారు. ఆ తర్వాత యూపీఐ నెంబర్ పనిచేయకపోవడంతో ఆర్టిజిఎస్ ద్వారా SBI బ్యాంకు నుంచి ఒకసారి 8 లక్షలు, ఒకసారి 5 లక్షలు అలా మొత్తం మీద 36 లక్షలు ఆర్టీజిఎస్ ద్వారా పంపారు.. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా బంధువుల దగ్గర అప్పు తీసుకుని మరీ కేసు లేకుండా చేసుకుందామని జనవరి 29వ తేదీన మరో 5 లక్షలు తన కుమారుడిని అడిగాడు..