Viral Video: కాలకేయుల్లాంటి తాలిబన్ల రాజ్యంలో అంతా అరాచకమే.. సైనికాధికారిని ఎలా టార్చర్ చేశారో చూడండి..

Viral Video: తాలిబన్లు ఆకృత్యాలు, వారు చేసే హింస చూస్తుంటే.. తాలిబన్లు ముందు పుట్టి, అరాచకం తర్వాత పుట్టిందని అని పించకమానదు. మానవ హక్కులను పక్కన పెడితే మానవత్వాన్ని సైతం మరిచి వీరు చేసే..

Viral Video: కాలకేయుల్లాంటి తాలిబన్ల రాజ్యంలో అంతా అరాచకమే.. సైనికాధికారిని ఎలా టార్చర్ చేశారో చూడండి..

Updated on: Dec 29, 2021 | 1:49 PM

Viral Video: తాలిబన్లు ఆకృత్యాలు, వారు చేసే హింస చూస్తుంటే.. తాలిబన్లు ముందు పుట్టి, అరాచకం తర్వాత పుట్టిందని అనిపించకమానదు. మానవ హక్కులను పక్కన పెడితే మానవత్వాన్ని సైతం మరిచి వీరు చేసే అరాచకాలు అన్నీఇన్నీ కావు. అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో ఏళ్లపాటు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అరాచకాలకు దిగి దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్ల ఆగడాలు తర్వాత మరింత ఎక్కువయ్యాయి. దేశాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే అరాచక పాలనను ప్రారంభించారు. ఇప్పటికే  దేశంలోని మహిళలపై ఉక్కుపాదం మోపుతోన్న తాలిబన్లు ఇప్పుడు ఆఫ్గనిస్తాన్‌కు చెందిన సైనిక అధికారులపై దాష్టికానికి దిగుతున్నారు.

తాజాగా ఇలాంటి దారుణానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో తాలిబన్లు ఆఫ్గన్‌కు చెందిన కొందరు మాజీ సైనికాధికారులను బంధీలుగా చేసుకున్నారు. నిజానికి వారందరినీ విడిచి పెడతామని ఇచ్చిన హామీని పక్కన బెట్టిన తాలిబన్‌ మూకలు అధికారులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో తాలిబన్ల దాష్టికానికి పరాకష్టగా కనిపిస్తోంది. సంకెళ్లతో ఉన్న ఓ సైనికాధికారిపై ఓ తాలిబన్‌ అత్యంత పాశవికంగా దాడి చేశాడు. మెడలపై కూర్చొని మొహంపై చెంప దెబ్బలు కురిపించాడు, అంతటితో ఆగకుండా బూటు కాళ్లతో తంతూ పైశాశిక ఆనందాన్ని పొందాడు. ఈ దాష్టికాన్ని వీడియోగా తీసి రాక్షస ఆనందాన్ని పొందారు.

దీంతో మరోసారి ప్రపంచం దృష్టి ఆఫ్గనిస్తాన్‌పై పడింది. ఆఫ్గనిస్తాన్‌లో రాక్షస పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, మాజీ సైనికులపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా కొందరు ఆఫ్గనిస్తాన్‌ రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతోన్న మానవ హక్కుల హననం గురించి పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నివేదికలు ఇస్తున్నప్పటికీ తాలిబన్లు మాత్రం వాటిని తిరస్కరిస్తూ వస్తున్నారు. మాజీ సైనికాధికారులపై జరుగుతోన్న దాడులకు వెంటనే స్వస్తిపలకాలని మాజీ సైనికాధికారి రహ్మతుల్లా అందర్‌ తెలిపారు.

Also Read: Vangaveeti: వంగవీటి రాధ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఐసీయులో ఉన్న వ్యక్తి రెక్కీ ఎలా చేశారు?

JIO: కస్టమర్లను అలర్ట్‌ చేసిన రిలయన్స్‌ జియో.. ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి అంటూ హెచ్చరిక..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?