Crime: రూ.1100 కోసం ప్రాణం తీసుకున్నాడు..! తోటి విద్యార్థులే తన పాలిటి యముల్లా మారారు.
11 వందల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం.. ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. షూ కొనుక్కునేందుకు తల్లి ఇచ్చిన 11 వందల రూపాయలు కనబడకపోవడంతో తోటి విద్యార్థులను నిలదీశాడు ఓ డిగ్రీ విద్యార్థి. అడిగిన పాపానికి ఆ విద్యార్థిపైనే తోటి విద్యార్థులు దాడికి దిగారు. ఆరుగురు విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
11 వందల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం.. ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. షూ కొనుక్కునేందుకు తల్లి ఇచ్చిన 11 వందల రూపాయలు కనబడకపోవడంతో తోటి విద్యార్థులను నిలదీశాడు ఓ డిగ్రీ విద్యార్థి. అడిగిన పాపానికి ఆ విద్యార్థిపైనే తోటి విద్యార్థులు దాడికి దిగారు. ఆరుగురు విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో పరువు పోయిందనే మనోవేదనతో అదే ఆస్పత్రిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. నెన్నల మండల కేంద్రానికి చెందిన కామెర ప్రభాస్ మందమర్రి మండలం పొన్నారం ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ.. బీకాం కంప్యూటర్స్ డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తన డబ్బులు పోయాయంటూ తోటీ విద్యార్థులను నిలదీశాడు ప్రభాస్. దీంతో రెచ్చిపోయిన తోటి విద్యార్థులు ప్రభాస్ తో గొడవకు దిగారు. నీ డబ్బులు కాదు అసలు మా డబ్బులే నువ్వు దొంగతనం చేశావంటూ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రభాస్ మెడపైన, ఛాతిపైన తీవ్రగాయాలయ్యాయి. గమనించిన హాస్టల్ సిబ్బంది.. హుటాహుటిన ప్రభాస్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మనస్థాపానికి గురైన ప్రభాస్ గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స అందించినా.. ప్రభాస్ ప్రాణాలు నిలవలేదు. దీంతో ప్రభాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..