Monster fish: జాలరి వలకు చిక్కిన అరుదైన చేప.. నెట్టింట వైరల్ అవుతున్న టైగర్ మస్కీ ఫిష్..
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు రకరకాల చేపలు పడతాయి. ఒక్కోసారి వారు ఊహించని విధంగా పెద్ద పెద్ద చేపలు, అరుదైన చేపలు వలకు చిక్కుతుంటాయి.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు రకరకాల చేపలు పడతాయి. ఒక్కోసారి వారు ఊహించని విధంగా పెద్ద పెద్ద చేపలు, అరుదైన చేపలు వలకు చిక్కుతుంటాయి. అలాంటి చేపలు జాలర్లకు దొరికినప్పుడు వారి పంట పండినట్లే.. ఎందుకంటే కొన్ని చేపలు అరుదుగా లభించడంతో అవి అధిక ధర పలుకుతుంటాయి. దాంతో మత్య్సకారులు ఆనందానికి అవధులుండవు…తాజాగా అమెరికాలో ఓ జాలరి వలకు అలాంటి చేప ఒకటి చిక్కింది. అమెరికాకు చెందిన ఓ జాలరి చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో వలకు ‘పేద్ద’ చేప చిక్కింది. ఈ చేప కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు దాన్ని చూసి స్టన్నవుతున్నారు. ఈ ‘పేద్ద’ చేప వార్త ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. జాలరి తన చేతులతో పట్టుకున్న చేప ఫొటోను కూడా జత చేశారు. ‘వేసవిలో చేపల వేట ఎలా కొనసాగుతుంది’ అనే కాప్షన్‌ను ఇచ్చారు. ఈ టైగర్ మస్కీ అనే పేరుగల పేద్ద చేపను షేర్ చేసిన జాలరి జో రివాస్‌కు ధన్యవాదాలు అంటూ ఫొటో కింద రాశారు. ఈ టైగర్ మస్కీ అనే చేప.. ఉత్తర పైక్-మస్కెలుంజ్ క్రాస్ బ్రీడ్‌గా నెటిజెన్లు భావిస్తున్నారు. ఈ చేప దాదాపు 42 అంగుళాల పొడవు ఉంది. ప్రౌఢ దశలో ఈ చేపలు దాదాపు 30 పౌండ్ల వరకు బరువు తూగుతాయట. ఇలాంటి క్రాస్ బ్రీడ్ చేపలు చాలా అరుదుగా ఉంటాయని వాషింగ్టన్‌లోని ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ విభాగం అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
