ఏడాదిలో 15 రోజులే పనిచేసే రైల్వే స్టేషన్
దేశంలో దాదాపు 7,500 రైల్వేస్టేషన్లున్నాయి. వీటిలో రోజుకు వంద రైళ్లు వచ్చిపోయే స్టేషన్లతో బాటు రెండు రోజులకోసారి ఒక్కో రైలు వచ్చే స్టేషన్లూ ఉన్నాయి. వీటిలో రైళ్లు వచ్చినా.. రాకున్నా.. స్టేషన్, అందులోని సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉంటారు. కానీ ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే పని చేసే రైల్వే స్టేషన్ ఒకటుందంటే నమ్ముతారా? అది కూడా పితృపక్షం రోజుల్లోనే పనిచేస్తుంది.
అదే..బిహార్‌లోని అనుగ్రహ నారాయణ్ రోడ్ స్టేషన్. బిహార్‌లోని ఈ స్టేషన్ సమీపంలో పున్‌పున్ నదీ తీరం ఉంది. ఏడాది పొడవునా నరమానవుడు కనబడని ఈ స్టేషన్.. ఏటా భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి మరునాటి నుంచి మహాలయ అమావాస్య వరకు కిటకిటలాడిపోతుంది. ఈ 15 రోజులూ దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు ఈ స్టేషన్‌లో దిగి.. సమీపంలోని నదీ తీరంలో తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడి పున్‌పున్ నదిని ఆది గంగ అని, అది గంగానది కంటే ప్రాచీనమైనదని భావిస్తారు. ఈ 15 రోజులు ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివస్తారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి పితృపక్షం మొదలు కావటంతో.. మళ్లీ ఈ బ్రిటిష్ కాలం నాటి స్టేషన్లో మళ్లీ రద్దీ పెరిగింది. ఈ స్టేషన్లో కనీసం టికెట్ కౌంటర్ కూడా ఉండదు. ఇది తాత్కాలిక హాల్ట్ స్టేషన్ గనుక.. ఇక్కడ దిగాలనుకున్న వారు.. దీనికి ముందు స్టేషనైన గయ వరకు టికెట్ తీసుకొని.. మార్గమధ్యలో నారాయణ్ రోడ్ స్టేషన్ లో దిగాలి. తమ కార్యక్రమం తర్వాత తిరిగి అదే టికెట్‌పై గయకు వెళ్లే వెసులు బాటు ఉంటుంది. సెప్టెంబరు 22 లోపు సుమారు 16 పాసింజర్ రైళ్లతో బాటు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లూ ఆగనున్నాయి. స్టేషన్‌లో పెద్ద సౌకర్యాలు లేకున్నా.. అక్కడ దిగే వారికి బస, పార్కింగ్ తదితర సౌకర్యాలను నదీతీరంలో ప్రభుత్వం కల్పిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెచ్-1బీ వీసాలపై వెనక్కి తగ్గిన ఇండియన్ ఐటీ
తిరుమల శ్రీవారికి అలంకరించే పూల మాలల ప్రత్యేకత ఏంటో తెలుసా?
Gold Loans: గోల్డ్ రేట్ ఎఫెక్ట్.. రూ.3 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్స్
