Bride postal stamps: పెళ్లికూతురు బొమ్మతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల.. 9 రాష్ట్రాల సంస్కృతులు తెలిపేలా..

|

May 08, 2023 | 8:24 PM

ఇప్పటివరకూ స్టాంపుల మీద ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకుల చిత్రాలనుచూశాం. ప్రముఖులు, దేశనేతలు, దేశంలో ప్రముఖ కట్టడాలు ఇలా రకరకాల స్టాంపులు మనం చూశాం. తాజాగా పోస్టల్‌ శాఖ పెళ్లికూతుర్ల బొమ్మతో ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు.

ఇప్పటివరకూ స్టాంపుల మీద ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకుల చిత్రాలనుచూశాం. ప్రముఖులు, దేశనేతలు, దేశంలో ప్రముఖ కట్టడాలు ఇలా రకరకాల స్టాంపులు మనం చూశాం. తాజాగా పోస్టల్‌ శాఖ పెళ్లికూతుర్ల బొమ్మతో ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్‌ పోస్టాఫీసువారు ఈ పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. తొమ్మిది రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించేలా పోస్టల్‌ స్టాంపులు రూపొందించారు. ఇందులో ఆయా రాష్ట్రాలలోని వివాహ సంప్రదాయం ఏవిధంగా ఉంటుందో చాటి చెబుతూ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి పెళ్లికి ముస్తాబైన పెళ్లి కుమార్తె బొమ్మతో పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు. అమలాపురం హెడ్‌ పోస్టాఫీసువారు విడుదల చేసిన పెళ్లికూతుర్ల గెటప్‌లో వివిధ రాష్ట్రాల పెళ్ళికూతురుల వేషధారణ స్టాంపులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. పంజాబ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మణిపూర్, కేరళ రాష్టలలో వుండే పెళ్లి కుతుర్ల వేషధారణ కట్టు, బొట్టు దుస్తులు అలంకరణ ఆయా రాష్ట్రాల్లో వుండే సంప్రదాయాలు దేశవ్యాప్తంగా తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టాంపులు విడుదల చేసినట్టు అమలాపురం హెడ్‌ పోస్ట్‌ మాస్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ స్టాంప్ ధర 25 రూపాయలు అని, త్వరలో అన్ని రాష్ట్రాల వదువుల వేషధారణ స్టాంప్స్ ను రిలీజ్ చేస్తాం అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!