Mysterious Fish: వింత చేప.. కాళ్లతో మంచుపై నడుస్తూ.. చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వైరల్ వీడియో.
మీరు వివిధ రకాల చేపలను చూసి ఉంటారు. అయితే కాళ్లున్న చేపలను ఎప్పుడైనా చూశారా.. అదేంటి చేపలకు మొప్పలు కదా ఉంటాయి.. కాళ్ళు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నారా.. అయితే వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..
వైరల్ వీడియోలో ఓచేప మంచు పైన కాళ్లమీద నిలబడి ఉంది. సాధారణంగా చేపలు నీటిలో మొప్పల సాయంతో ఈదుతాయి. ఊపిరిని పీల్చుకుంటాయి. అయితే అందుకు భిన్నమైన దృశ్యం ఇది. చేప ‘పాదాల’ మీద హాయిగా నిలబడి ఉంది. ఇది చేప లేక మరేదైనా వింత సముద్ర జీవా అనేది మిస్టరీగా మారింది. కానీ చూడడానికి అది చేపలా అనిపిస్తుంది. చేపలకు కాళ్లు ఉండవు.. వైరల్ వీడియోలో ఉన్న చేపకు కాళ్లు ఉన్నాయి. చేపకు పాదాలు ఎలా పెరిగాయనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @OTerrifying అనే IDతో షేర్ చేశారు. ‘ఇదో వింత చేప.. మంచుపై నిలబడి ఉన్న చేప’ అంటూ కాప్షన్ జత చేశారు. కేవలం ఈ వీడియోను 77 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్షల్లో లైక్ చేసారు. అంతేకాదు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది దేవుని సృష్టి.. దేవుడి చేపని అంటే.. మరొకొందరు అసలు ఇది ఏ జాతికి చెందిన జీవి అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..