Dhoop Stick: అయోధ్య రామ మందిరానికి గుజరాత్‌ భక్తుడి అతి పెద్ద అగరబత్తీ కానుక.!

|

Dec 22, 2023 | 4:31 PM

అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకోనుంది. మందిర ప్రాంగణంలో సువాసనలు వెదజల్లే అతి పెద్ద అగరబత్తి రెడీ వుతోంది. గుజరాత్‌లోని వడోదరలో విహాభాయ్ భర్వాద్ అతి పెద్ద అగరబత్తీని తయారుచేస్తున్నారు. 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పున్న దీని బరువు 3500 గ్రాములు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా అయోధ్యకు తరలించనున్నారు.

అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకోనుంది. మందిర ప్రాంగణంలో సువాసనలు వెదజల్లే అతి పెద్ద అగరబత్తి రెడీ వుతోంది. గుజరాత్‌లోని వడోదరలో విహాభాయ్ భర్వాద్ అతి పెద్ద అగరబత్తీని తయారుచేస్తున్నారు. 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పున్న దీని బరువు 3500 గ్రాములు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా అయోధ్యకు తరలించనున్నారు. విహాభాయ్ భర్వాద్ గత ఆరు నెలలుగా తన ఇంటి బయట అగరబత్తీ తయారు చేస్తున్నారు. స్థానిక ఎంపీ రంజన్‌బెన్ భట్, ఆమె బృందం విహాభాయ్‌కి సహాయం అందిస్తున్నారు. గతంలో 111 అడుగుల పొడవున్న అగరబత్తీని విజయవంతంగా తయారు చేశారు. భర్వాద్ ధూప్‌ స్టిక్‌ తయారీలో 3000 కిలోల గిర్ ఆవు పేడ, 91 కిలోల గిర్ ఆవు నెయ్యి, 280 కిలోల దేవదార్ చెక్క, 425 కిలోల హవన్ పదార్థాలను కలిపినట్లు తెలిపారు. వడోదర నుండి అయోధ్యకు దూరం దాదాపు 1,800 కి.మీ. ధూప్‌స్టిక్‌ రవాణా కోసం ప్రత్యేక ట్రైలర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి వెలిగిస్తే 45 రోజుల వరకు నిరంతరం సువాసనలు వెదజల్లుతుందని విహాభాయ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.