99 ఏళ్ల బామ్మ !! 100వ మునిమనవడిని ముద్దాడిన వేళ !!

Updated on: Aug 23, 2022 | 6:52 PM

సన్యాసినిగా ఉండిపోవాలని భావించిన ఓ మహిళ.. ఆపై పెళ్లి చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11మంది సంతానానికి జన్మనిచ్చింది. అలా ఆమె కుటుంబం పెరుగుతూ పోయింది.

సన్యాసినిగా ఉండిపోవాలని భావించిన ఓ మహిళ.. ఆపై పెళ్లి చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11మంది సంతానానికి జన్మనిచ్చింది. అలా ఆమె కుటుంబం పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆమె తన 99వ ఏట తన 100వ మునిమనవడిని ఎత్తుకొని ముసిముసి నవ్వులతో మురిసిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్‌ కోల్లెర్‌ తన 100వ మునిమనవడిని కలిసి ఆనందంలో మునిగిపోయింది. కోల్లెర్‌ మనవరాలు ఈమధ్యే తనకు పుట్టిన కుమారుడిని తీసుకెళ్లి ఆమె చేతుల్లో పెట్టగా.. ‘నేనెంతో అదృష్టవంతురాలిని’ అంటూ ఆ వృద్ధురాలు సంబరపడిపోయింది. ఆ బుడతడికి కోల్లెర్‌తోపాటు ముత్తాత పేరు వచ్చేలా ‘కోల్లెర్‌ విలియమ్‌ బాల్‌స్టర్’గా పేరు పెట్టామని చెప్పడంతో ఆమె సంతోషం రెట్టింపయ్యింది. ఈ అరుదైన ఘట్టంపై ఆ వృద్ధురాలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది. తానెంతో అదృష్టవంతురాలినని పేర్కొంది. చాలా రోజులు ఒంటరి జీవితం అనుభవించానని, అందుకే ఓ పెద్ద కుటుంబం ఉండాలని భావించానంది. కాగా అది ఎప్పుడో నెరవేరిందని సంబరపడిపోయింది. మరికొద్ది రోజుల్లోనే కోల్లెర్‌ వందో వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కాగా ఆమె 100వ పుట్టినరోజును ఘనంగా జరపాలని కుటుంబీకులు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??

పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్‌.. అంటున్న భారత క్రికెటర్

కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు

ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??

Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!

 

Published on: Aug 23, 2022 06:52 PM
Loading...
Unable to load recommendations.
Follow Us