గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

Updated on: Jun 03, 2026 | 2:36 PM

చైనాలో ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో ఒక గొర్రెల కాపరి ఉద్యోగ ప్రకటన వెల్లడించింది. నెలకు రూ.1.10 లక్షల జీతం, ఉచిత వసతి, రేషన్‌తో కూడిన రెండు పోస్టుల కోసం ఏకంగా 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మైనస్ 30 డిగ్రీల చలి, తీవ్రమైన ఒంటరితనాన్ని తట్టుకునే సామర్థ్యం అవసరమయ్యే ఈ ఉద్యోగం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

చైనాలో ఉద్యోగ మార్కెట్ ఎంత క్లిష్టంగా మారిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. మంగోలియా సరిహద్దుల్లోని మారుమూల గడ్డి మైదానాలలో 3 వేల గొర్రెలను కాయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలంటూ చైనాకు చెందిన ఫామ్ యజమాని జువో జియావోయాంగ్ ప్రకటన ఇచ్చారు. అదే ఇప్పడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్ట్ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 5.9 కోట్ల వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేవలం రెండు పోస్టుల కోసం ఏకంగా 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1.10 లక్షల జీతంతో పాటు ఉచిత వసతి, ఉచిత రేషన్ ఇస్తామని యజమాని ప్రకటించాడు. చైనాలో ప్రైవేట్ ఉద్యోగుల సగటు జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడంతో షాంఘై, చోంగ్‌కింగ్ వంటి నగరాలలోని వైట్ కాలర్ ఐటీ ఉద్యోగులు, ఫ్యాక్టరీ కార్మికులు, అప్పుల్లో ఉన్నవారు, డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగ యువత కూడా ఈ ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ గొర్రెల కాపరి ఉద్యోగం అనుకున్నంత సులభం కాదు. దాదాపు 4,900 ఎకరాల విస్తీర్ణంలో గొర్రెలను మేపాలి. ముఖ్యంగా శీతాకాలంలో మైనస్ 30 డిగ్రీల గడ్డకట్టే చలిని తట్టుకోవాలి. ఏడాది పొడవునా మనుషులెవరూ కనిపించని ఘోరమైన ఒంటరితనాన్ని భరించాలి. ఈ కఠిన పరిస్థితులను తట్టుకోలేరనే ఉద్దేశంతో యజమాని జువో.. నగర యువతను కాకుండా, గతంలో వ్యవసాయ అనుభవం ఉండి, ఒంటరితనాన్ని తట్టుకోగల రెండు జంటలను ఈ ఉద్యోగానికి ఎంపిక చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. మన నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష!

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

Follow Us