Doctors: వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

|

Oct 21, 2024 | 9:09 AM

వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. మరి అలాంటి డాక్టర్లే రోగాల బారిన పడితే.. అదీ కూడా శరీరాన్ని గుల్ల చేసే మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు చుట్టుముడితే.. యస్‌.. తలుచుకుంటేనే భయమేస్తోంది కదూ.. కానీ మీరు వింటున్నది నిఖార్సయిన నిజం. డాక్టర్లు సమాజ ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహిస్తారు.

ప్రజలకు ఆహారపు అలవాట్లకు సంబంధించి.. బాగోగులు చెప్పే వైద్యులే ఇప్పుడు జీవనశైలికి సంబంధించిన వ్యాధుల భారిన పడుతున్నారు. సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెప్పే వైద్యులనే.. ఇప్పుడు వాటికి సంబంధించిన రోగాలు చుట్టుముడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆహ్మదాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే రిపోర్ట్‌.. సంచలన విషయాలు వెల్లడించింది. వైద్యులకు వ్యాధుల వెనుక వారి జీవనశైలి ఎంతటి ఎఫెక్ట్‌ చూపుతుందనేది ఆ రిపోర్ట్‌ తేటతెల్లం చేస్తోంది. జామ్‌నగర్‌లోని ఎంపీ షా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 490 మంది వైద్యులను సర్వే చేసింది.

20 శాతం మంది వైద్యులు ఊబకాయంతో బాధపడుతున్నారని, 53 శాతం మంది డాక్టర్లు మధుమేహం, 24 శాతం మంది వైద్యులు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారని అధ్యయనంలో గుర్తించారు. అయితే మిగతా వైద్యులపై కూడా ఇదే రకమైన ఎఫెక్ట్‌ ఉండే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు.

ప్రభుత్వ వైద్యులలో ఊబకాయం పెరగడం, కార్డియోమెటబోలిక్ చిక్కులపై ఈ అధ్యయనం చేశారు. జామ్‌నగర్‌లోని MP షా మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ జర్నల్‌లో ఈ రిపోర్ట్‌ ను ప్రచురించారు.

బాడీ మాస్ ఇండెక్స్, రక్తపోటు, ఉపవాసం, గ్లూకోజ్, లిపిడ్‌ ప్రొఫైల్ తో సహా ప్రభుత్వ వైద్యుల కోసం పరిశోధకులు వివిధ పారామీటర్లను లెక్కలోకి తీసుకున్నారు. వీటి ఫలితాలను చూస్తే.. కేవలం 10% వైద్యులు మాత్రమే సాధారణ బరువు కేటగిరీలో ఉన్నారు. 20% మంది స్థూలకాయంతో ఉన్నట్లు గుర్తించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 26.5% మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇక్కడ బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18.5–24.9 శాతంతో ఉంటుంది. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవారూ ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలలో ఊబకాయం 1998లో 11.8% ఉండగా, 2016లో అది 31.3%కి పెరిగినట్లు గుర్తించారు.

డాక్టర్లు సమాజ ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహిస్తారు. కానీ నేడు వారు కూడా జీవనశైలి వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 30-50 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఒత్తిడి దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సాధారణ ప్రజల మాదిరిగానే వైద్యులు కూడా జీవనశైలి సంబంధిత వ్యాధుల ఎదుర్కోవడం నిజంగా విచారకరమే. వారి ఆహారపు అలవాట్లు, ఎక్కువ పని గంటలు దీనికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. అహ్మదాబాద్ మెడికల్ అసోసియేషన్ ఇదే చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on