Girls Drinks Pesticide: స్కూల్లో పురుగులు మందు తాగిన విద్యార్ధినిలు.. ఏం జరిగిందంటే.. వీడియో.
పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు కూల్‌డ్రింక్ బాటిల్‌లో ఉన్న పురుగులు మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయితీ పరిధిలోని
వెంకటాపూర్, ములుగు, న్యూస్‌టుడే: అభం.. శుభం తెలియని ముగ్గురు చిన్నారులు పాఠశాలలో ఓ శీతలపానీయం బాటిల్‌లో ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల కథనం ప్రకారం.. నాలుగో తరగతి చదువుతున్న ఆరెపల్లి అక్షర, సాదు అఖిల, ఐదో తరగతికి చెందిన సాదు ఐశ్వర్య క్లాసులో ఏడుస్తుండగా తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాజేశ్‌కుమార్‌కు తెలియజేశారు. ఎందుకు ఏడుస్తున్నారని ఆయన వారిని ప్రశ్నించారు. దాంతో అక్షర బ్యాగులోని బాటిల్‌లో ఉన్న తెల్లని ద్రావణాన్ని ముగ్గురం కలిసి తాగినట్లు బాలికలు చెప్పారు. ఆ బాటిల్ వాసన చూసిన ప్రధానోపాథ్యాయుడు అది పురుగుల మందు వాసన రావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, తక్షణం విద్యార్థినులను ములుగు ఏరియా ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత చిన్నారులను ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, బాలిక స్కూలు బ్యాగులోకి పురుగులు మందు ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
