ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్‌ చూసి షాక్‌ !!

Updated on: Apr 18, 2023 | 9:39 AM

మహారాష్ట్రలోని గోండియా నగరంలో ఓ మహిళ ఇంటిని శుభ్రం చేస్తోంది. డోర్ పక్కకు నెట్టి ఊడుస్తోంది. ఆ తలుపు వెనక చిన్న రంద్రంలో పాము పిల్ల కనిపించింది. దెబ్బకు అదిరిపోయిన ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ పరుగులు తీసింది. వెంటనే అలర్ట్ అయిన ఇంటి యజమానులు..

మహారాష్ట్రలోని గోండియా నగరంలో ఓ మహిళ ఇంటిని శుభ్రం చేస్తోంది. డోర్ పక్కకు నెట్టి ఊడుస్తోంది. ఆ తలుపు వెనక చిన్న రంద్రంలో పాము పిల్ల కనిపించింది. దెబ్బకు అదిరిపోయిన ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ పరుగులు తీసింది. వెంటనే అలర్ట్ అయిన ఇంటి యజమానులు.. ఆ పామును బయటకు తీశారు. అలా తీయడమే ఆలస్యం.. వెనువెంటనే ఒక్కొక్కటిగా పాములు బయటకు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. వస్తూనే ఉన్నాయ్‌. వాటిని చూసి బెదిరిపోయిన ఇంటి సభ్యులు.. కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. తలుపు ఫ్రేమ్, టైల్స్ పగలగొట్టగా అందులో కుప్పలు కుప్పలుగా ఉన్న పాములను చూసి అతను సైతం షాక్‌కు గురయ్యాడు. అయితే, నాలుగు గంటల పాటు శ్రమించి దాదాపు 39 పాములను పట్టుకున్నాడు. ఆ పాములన్నింటినీ ప్లాస్టిక్ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. అయితే ఈ పాములు.. విషపూరితమైనవి కాదని స్నేక్ క్యాచర్ పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై వధువు డాన్స్‌.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు

బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!

మ‌న‌వ‌డి పెళ్లిలో తాత డాన్స్‌.. 96 ఏళ్ల వ‌య‌సులో క్రేజీ స్టెప్స్‌

Prabhas: ప్రభాస్‌ దావత్‌ అంటే.. మామూలుగా ఉండదు మరి..

Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..

 

Published on: Apr 18, 2023 09:39 AM
Loading...
Unable to load recommendations.
Follow Us