Mosquito bite effect: చిన్న దోమకాటుకు 30 ఆపరేషన్లు.. చివరికి కోమాలోకి వెళ్లిన వ్యక్తి..! ఎందుకంటే..

|

Dec 02, 2022 | 10:03 PM

జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి అనే వ్యక్తిని ఓ దోమ కరిచింది. దాంతో అతనికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. అది క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి అవి పనిచేయడం మానేసాయి.


జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి అనే వ్యక్తిని ఓ దోమ కరిచింది. దాంతో అతనికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. అది క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి అవి పనిచేయడం మానేసాయి. చివరికి అతను దోమ కరిచినచోట చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. ఆసియా టైగర్ దోమ సెబాస్టియన్ ఎడమ తొడపై కుట్టింది. దోమ కాటు ద్వారా సెరాటియా అనే బ్యాక్టరీయా శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అతడిలో ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపించాయట.. ఆ తర్వాత రాను రాను అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజూకు దిగజారిపోయింది. ఇన్‌ఫెక్షన్‌తో తొడ భాగం మొత్తం పాడవడంతో.. అతడు మంచానికే పరిమితమయ్యాడు. చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయాడు.దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయట.. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం సెబాస్టియన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ అతను మునపటిలా పూర్తి ఆరోగ్యంగా ఉండలేడని, ఇలాంటి దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

 

Follow us on