ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు

Updated on: Dec 08, 2025 | 3:00 PM

మధ్యప్రదేశ్‌కు చెందిన మూడేళ్ల సర్వజ్ఞ సింగ్ కుశ్వాహ చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఫోన్‌కు బానిసైన సర్వజ్ఞను ఆటవైపు మళ్లించడానికి తల్లిదండ్రులు చెస్ నేర్పించారు. కేవలం ఆరు నెలల్లోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించి, FIDE ర్యాంకింగ్ పొందిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ బాలుడు ముగ్గురు అంతర్జాతీయ ప్లేయర్స్‌ను ఓడించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

మధ్యప్రదేశ్‌లో మూడేళ్ల బాలుడు సర్వజ్ఞ సింగ్ కుశ్వాహకు అన్నం తినిపించడానికి, పని చేసుకునేంత వరకు అతడు కదలకుండా కూర్చోవడానికి తల్లితండ్రులు ఫోన్ అలవాటు చేశారు. కానీ సర్వజ్క్ష గంటల తరబడి ఫోన్ చూస్తానని పట్టుబట్టడంతో.. అది ప్రమాదం అని భావించిన తల్లిదండ్రులు అతడి చేత ఫోన్ మాన్పించాలనుకున్నారు. అలా అని బయటకు తీసుకెళ్లి గంటలు గంటలు ఆడించలేరు కాబట్టి.. ఏదైనా ఇండోర్ గేమ్ నేర్పించాలనుకున్నారు. వెంటనే చెస్ తీసి ఆడించడం ప్రారంభించారు. సర్వజ్ఞ.. చెస్ బాగా నేర్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులను ఓడించే స్థాయికి చేరుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఓ వ్యక్తిగత కోచ్‌ను ఏర్పాటు చేశారు. ఇలా సర్వజ్ఞ కేవలం ఆరు నెలల్లోనే అద్భుతంగా ఆట ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో కోచ్ నితిన్ చౌరాసియా.. నేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఆకాశ్ ప్యాసీతో కూడా కోచింగ్ ఇప్పించాడు. ఇలా రోజుకు ఆరు గంటల పాటు వీరిద్దరూ సర్వజ్ఞకు కోచింగ్ ఇవ్వగా.. అతడి ప్రతిభ చూసి వీరూ ఆశ్చర్యపోయారు. దీంతో అతడిని అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సర్వజ్ఞ.. ప్రతిష్టాత్మక FIDE ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE)లో ర్యాంకింగ్‌ సంపాదించి.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సర్వజ్ఞ ప్రస్తుతం FIDE ర్యాంకింగ్‌లో 1572వ స్థానంలో ఉన్నాడు. గతంలో ఈ రికార్డు.. 3 ఏళ్ల 8 నెలల వయసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనీష్ సర్కార్ పేరు మీద ఉండేది. ఇక FIDE ర్యాంకింగ్‌ సాధించడానికి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని ఓడించడం తప్పనిసరి. సర్వజ్ఞ అతి తక్కువ వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాళ్లను ఓడించాడు. సర్వజ్ఞ సాధించిన ఈ రికార్డు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్

పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం

మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు

Akhanda 2: అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే