ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

Updated on: Mar 01, 2026 | 7:50 PM

తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతుల కడుపుకోత. కూలీలుగా పనిచేసుకుంటూ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి హన్సికను నాగుపాము కాటు వేసింది. ఆసుపత్రికి తరలించినా విషం శరీరమంతా పాకడంతో మృతి చెందింది. పసిప్రాణం కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలనున కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్నారు. రోజంతా కూలి పనులతో రెక్కలు ముక్కలు చేసుకున్నా, పిల్లల నవ్వులు చూసి ఆ అలసటను మర్చిపోయేవారు. ఇంతలోనే విధి వక్రించింది. నాగుపాము రూపంలో వారి ఇంట తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె మూడేళ్ల హన్సిక బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అచేతనంగా పడిపోయింది. అప్పటివరకు తల్లి ఒడిలో గోరుముద్దలు తిన్న చిన్నారి మాటలు వినిపించకపోవడంతో, కంగారుగా బయటకు వచ్చిన తల్లికి తన బిడ్డ విగతజీవిగా కనిపించింది. సమీపంలోని రెల్లుగడ్డిలో పడగవిప్పి బుసలు కొడుతున్న త్రాచుపామును చూసి ఆమె గుండె పగిలేలా రోదించింది. స్థానికులు వెంటనే ఆ పామును హతమార్చి, బాలికను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం తరలించగా, అప్పటికే విషం శరీరం అంతా పాకడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే ఆడుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పసిప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోవడంతో అనంతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!

Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

Follow Us