భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023
2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ దెబ్బకు గత రికార్డులు మాయమయ్యాయి. మునుపటి రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా నమోదై పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల థ్రెషోల్డ్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఈరకంగా పెరగడంపై సర్వత్ర ఆందోళన కనిపిస్తోంది. భవిష్యత్తులో భూమి ఎదుర్కోబోతున్న విపత్తులకు ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ దెబ్బకు గత రికార్డులు మాయమయ్యాయి. మునుపటి రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా నమోదై పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల థ్రెషోల్డ్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఈరకంగా పెరగడంపై సర్వత్ర ఆందోళన కనిపిస్తోంది. భవిష్యత్తులో భూమి ఎదుర్కోబోతున్న విపత్తులకు ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో 2016 రికార్డును 2023 బద్దలుగొట్టి హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్‌గా నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే ఇది 0.17 డిగ్రీలు అధికం. భూగోళం వేడుక్కుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు, అంటార్కిక్ సముద్రపు మంచు కూడా రోజురోజుకు కుంచించుకుపోతోంది. ఇంకోవైపు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు కూడా పెరిగి 421 PPM కు చేరుకుంది. ఇది 14 మిలియన్ సంవత్సరాలకంటే అధికం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెజ్ మీల్‌లో నాన్‌వెజ్.. ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం
స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్ ఆర్1’
‘అటల్ సేతు’ పై సముద్రంలో 16 కి.మీ. ప్రయాణం
విమానంలో నిలిచిపోయిన ఆక్సిజన్.. ఫుట్‌బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ