నడిరోడ్డుపై చిరుత ప్రత్యక్షం.. వాహనదారులు పరుగులు
కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి రహదారిపై కనిపించి వాహనదారులను భయపెట్టింది. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిద్ధవటం రేంజ్‌లో వన్యప్రాణుల సంచారం పెరిగిన నేపథ్యంలో, అటవీ శాఖ రాత్రి 9 గంటల తర్వాత ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు తమ భద్రత దృష్ట్యా రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానిక వాహనదారులను హడలెత్తిస్తోంది. సిద్ధవటం అటవీ పరిధిలోని ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ఓ చిరుత స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించింది. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు తన మొబైల్‌లో ఈ దృశ్యాలను బంధించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సిద్ధవటం-బద్వేలు మార్గంలోని అట్లూరు వరకు ఉన్న అటవీ ప్రాంతం లంకమల అభయారణ్యానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సుమారు 30 వరకు పులులు ఉన్నట్లు గతంలో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో, రాత్రి 9 గంటల తర్వాత అటు వన్యప్రాణుల రక్షణ, ఇటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఫారెస్ట్ అధికారులు రాకపోకలను నిషేధించారు. అయితే, బుధవారం రాత్రి చెక్ పోస్టులు మూసివేసే సమయానికి రహదారిపైకి చిరుత రావడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు, అటవీ ప్రాంతంలో రాత్రి వేళ వన్యప్రాణులు రోడ్లపైకి రావడం సహజమేనని పేర్కొన్నారు. అందుకే రాత్రిపూట ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, వాహనదారులు నిబంధనలు అతిక్రమించి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. సిద్ధవటం రేంజ్‌లో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింగిల్ బ్యాంకు ఖాతాలోనే రూ. 213 కోట్లు.. అప్పులు జీరో..
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్.. సజ్జనార్ రియాక్షన్
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..
