Viral Video: కొండపై తీరిగ్గా కూర్చున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా గుండె గుభేల్!
జనవాసాలకు సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. తూప్రాన్ మండల పరిధిలోని మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అడవి ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత పులిని చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్ లో చిరుత పులి చిత్రాలను..
మెదక్, అక్టోబర్ 2: మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. తూప్రాన్ మండల పరిధిలోని మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అడవి ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత పులిని చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్ లో చిరుత పులి చిత్రాలను చిత్రీకరించారు. చిరుతపులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. చిరుత పులిని బంధించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుతపులులను గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రాత్రివేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్ళవద్దని సూచించారు. చిరుత పులికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సెల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తమ పొలాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు. కాగా గత కొంత కాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తున్న ఉదంతాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. అటవీ ప్రాంతం తరిగిపోవడం, అడవుల్లోని జంతువులకు ఆహారం దొరకకపోవడం వల్ల అవి జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.