కొత్తగా ఆధార్‌ కోసం అప్లై చేస్తున్నారా.. పాస్ పోర్ట్ తరహాలో

Edited By:

Updated on: Jan 02, 2024 | 4:19 PM

పద్దెనిమిదేళ్ల వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని UIDAI సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు.. జిల్లా, సబ్ డివిజనల్ స్థాయుల్లో నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పద్దెనిమిదేళ్ల వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని UIDAI సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు.. జిల్లా, సబ్ డివిజనల్ స్థాయుల్లో నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం జిల్లా ప్రధాన పోస్టాఫీసులు, ఇతర ఆధార్ కేంద్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు. తొలిసారిగా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలపై డాటా క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. అనంతరం, సర్వీస్‌ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్‌కు పంపిస్తారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లియరెన్స్ వచ్చిన 180 రోజుల్లోపు ఆధార్ జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనలన్నీ 18 ఏళ్లకు పైబడి తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఆధార్ కార్డు జారీ అయ్యాక సాధారణ పద్ధతుల్లోనే వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమె జుట్టు విలువ రూ.9 కోట్లు !! ఎందుకంటే ??

చదివింది ఇంటరే.. వీడి వేషాలు మాత్రం వేరే లెవల్‌..

ఈ కుక్కను పట్టుకున్నవారికి రూ.5 వేలు బహుమానం

వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు

Published on: Dec 25, 2023 02:03 PM
Loading...
Unable to load recommendations.
Follow Us