చెన్నై–నర్సాపూర్ వందే భారత్ ప్రారంభం

Updated on: Dec 17, 2025 | 5:49 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త! చెన్నై-విజయవాడ వందే భారత్‌ను నరసాపురం వరకు పొడిగిస్తూ డిసెంబర్ 15న ప్రారంభించారు. వాస్తవానికి 2026 జనవరిలో రావాల్సిన ఈ రైలు, ఎంపీ శ్రీనివాసవర్మ చొరవతో ఒక నెల ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఇది నరసాపురం, భీమవరం, గుడివాడ వంటి ప్రాంతాల వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నరసాపురం – చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 15న ప్రారంభమైంది. చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్‌ను నరసాపురం వరకూ పొడిగించారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో రైలు ప్రారంభమవుతుందని.. రైల్వేబోర్డు గతంలో ప్రకటించింది. అయితే స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రత్యేక చొరవతో ఒకనెల ముందుగానే మొదలు అయింది. వందే భారత్ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో బయల్దేరుతుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 11.45కి చేరుకుంటుంది. 11.50కి విజయవాడ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.25కి గుడివాడకు చేరుకుంటుంది. 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం స్టేషన్ చేరుకుంటుంది. అనంతరం 20678 నంబరుతో మధ్యాహ్నం 2.50 నిమిషాలకు నరసాపురం రైల్వే స్టేషన్‌లో బయలుదేరి 3.20 గంటలకి భీమవరం, 4.10కి గుడివాడకు చేరుకుంటుంది. అనంతరం 4.50 గంటలకు విజయవాడకు చేరుతుంది. విజయవాడ నుంచి 4.55 బయల్దేరితే, సాయంత్రం 5.20కి తెనాలి రైల్వేస్టేషన్, 6.30 గంటలకు ఒంగోలు, రాత్రి 7.40 గంటకు నెల్లూరు రైల్వేస్టేషన్ మీదుగా, 8.50కి గూడూరుకు, 9.50కి రేణిగుంటకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్‌

వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు