Update Aadhaar: ఆధార్‌ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక సూచనలు

Updated on: Aug 30, 2025 | 1:47 PM

ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, పిల్లలను స్కూల్లో జాయిన్‌ చెయ్యాలన్నా, బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలన్నా ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికీ ఆధారం..ఆధారే. పుట్టిన బిడ్డనుంచి పండు ముదుసలి వరకూ ఈ ఆధార్‌ తప్పనిసరి. దీనిని కేంద్రప్రభుత్వం జారీచేస్తుంది. కాగా ఈ ఆధార్‌పై యూఐడీఏఐ కీలక సూచనలు చేసింది.

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షలైన నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవ్వాలంటే ఆధార్‌ తప్పనిసరి. అలాగే ప్రభుత్వ పథకాలను పొందాలన్నా విద్యార్ధులకు అప్‌డేటెడ్‌ ఆధార్‌ అవసరముంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ స్కీములు పొందాలంటే అధార్‌ అప్‌డేట్‌ అత్యంత కీలకమని యూఐడిఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ చీఫ్ భువనేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు మారతాయని, అలాగే కనుపాపలు కూడా మార్పుచెందుతాయని ఈ క్రమంలో బయోమెట్రిక్ వివరాలలో మార్పులు వస్తాయని, అందుకే వాటిని కచ్చితమైన సమయాల్లో అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి 5 నుంచి 7 ఏళ్ల మధ్య ఒకసారి, ఆ తర్వాత 15 నుంచి 17 ఏళ్ల మధ్య మరోసారి బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ సూచించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆధార్‌ అప్‌డేట్‌ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తారని స్పష్టం చేసింది. తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, పాఠశాలల్లోనే ప్రత్యేక క్యాంపులను నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే విద్యార్థులు కీలకమైన విద్యా, ఉద్యోగావకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని యూఐడీఏఐ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Megastar Chiranjeevi: అభిమానికి మెగాస్టార్‌ భరోసా!

ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి

Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

బంగారం వదిలేసి కొత్త బాట పట్టిన తమిళనాడు స్మగ్లర్లు

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. సూర్యరశ్మితో ఇంధనం తయారీ!