Pralhad Joshi: “కాంగ్రెస్ వాళ్ల ప్రసంగం దెయ్యం నోటి నుంచి భగవద్గీత విన్నట్లు ఉంది”
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. ఆ డీటేల్స్ వీడియోలో చూడండి....
కాంగ్రెసోళ్ల ప్రసంగం వింటుంటే… దెయ్యం నోటి నుంచి భగవద్గీత విన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. కాంగ్రెస్ చాలాసార్లు రాజ్యాంగాన్ని అవమానించిందని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో వారు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కూడా అవమానించిన విషయం అందరికీ తెలుసన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని, ఇప్పటికైనా బుద్ది నేర్చుకుని పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. రైతుల నిరసన గురించి మాట్లాడుతూ, సంబంధిత మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షిస్తోందని, అయితే దాని గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 06, 2024 12:20 PM