సిలిగురిలో స్టేజ్ పై అస్వస్థతకు గురైన నితిన్ గడ్కరి(Video)

Updated on: Nov 18, 2022 | 8:45 AM

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం (నవంబర్ 17) అస్వస్థతకు గురయ్యారు. ఒక కార్యక్రమంలో వేదికపై అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం (నవంబర్ 17) అస్వస్థతకు గురయ్యారు. ఒక కార్యక్రమంలో వేదికపై అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. స్టేజ్‌పై ఉండగానే షుగర్ లెవెల్ పడిపోవడంతో అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అనంతరం ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం ఘటనాస్థలికి చేరుకుని కేంద్ర మంత్రికి ప్రథమ చికిత్స అందించారు. గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ, బెంగల్ సీఎం మమత ఆరా తీశారు. వైద్యులకు ఫోన్‌ చేశారు. వైద్యం అదిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

Published on: Nov 18, 2022 08:45 AM