కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు..
కర్నూలు జిల్లాలో మద్దికెరలో విషాదం చోటు చేసుకుంది. గుంతకల్ నుంచి మద్దికేరకు వచ్చే టాటా ఏఐసీ ఆటో ముందు టైరు పగిలి వాహనం అదుపుతప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో మద్దికేరకు చెందిన ఇద్దరు మహిళలు ఆదిలక్ష్మీ, రంగమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు.
కర్నూలు జిల్లాలో మద్దికెరలో విషాదం చోటు చేసుకుంది. గుంతకల్ నుంచి మద్దికేరకు వచ్చే టాటా ఏఐసీ ఆటో ముందు టైరు పగిలి వాహనం అదుపుతప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో మద్దికేరకు చెందిన ఇద్దరు మహిళలు ఆదిలక్ష్మీ, రంగమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనం టైరు పగిలిన వెంటనే విద్యుత్ పోల్ కు వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. వాహనం ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.
గాయపడిన వారిని మద్దికెర, పత్తికొండ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా చిప్పగిరి మండలంలో మిరపకాయలు తెంచేందుకు కూలీ పనులకు వెళ్లి తమ గ్రామం మద్దికెరకి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టాటా ఏఐసీ వాహనంలో దాదాపు 40 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..