మీ గుడి మీద మైక్ లేదా ?? ఈ టీటీడీ ఆఫర్ మీకే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు కీలక రాయితీలు ప్రకటించింది. మైక్ సెట్లు, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి, పంచలోహ విగ్రహాలను తక్కువ ధరకే అందిస్తోంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 90% రాయితీతో పాటు ఇతర ఆలయాలకు 50-75% సబ్సిడీ లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి తహశీల్దార్, దేవాదాయశాఖ సిఫార్సు లేఖలు తప్పనిసరి.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను అందించాలని నిర్ణయించింది. హిందూ ఆలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలను టీటీడీ అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాల కోసం 0877-2264276 నంబరును సంప్రదించాలని టిటిడి కోరుతోంది. మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.25,000. దరఖాస్తు చేసిన వారు ఏపీకి చెందిన SC, STలైతే 90 శాతం రాయితీ పోనూ పదిశాతం అంటే కేవలం రూ.2,500 డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపితే చాలు. మిగిలిన ఇతర వర్గాల దరఖాస్తుదారులు కేవలం సగంధర.. అంటే రూ. 12,500లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది.అంతే కాకుండా హిందూ దేవాలయాలకు.. కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీపై కేవలం రూ.7,250 లకే టిటిడి అందిస్తుంది. హిందూ దేవాలయాలకు శేష వస్త్రాలనూ టిటిడి ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను.. కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. నూతనంగా నిర్మించే ఆలయాలకు శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 90 శాతం సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75 శాతం సబ్సిడీతో అందిస్తారు. ఇక విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో టిటిడి అందిస్తోంది. మఠాలు, ట్రస్ట్‌లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50 శాతం రాయితీతో అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏవియేషన్ చరిత్రలో అద్భుతం.. ప్రకృతి థీమ్‌తో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్
Duvvada Srinivas: రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం
ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు
కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే