శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??

|

Sep 25, 2023 | 7:49 PM

తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మరథాల పేరుతో ఉచిత బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. సెప్టెంబర్‌ 24 తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును గప్ చుప్ గా తీసుకెళ్లాడో దొంగ.. కొండమీద తిరగాల్సిన బస్సు తిరుపతికి వెళుతున్నా అలిపిరి గేటు వద్ద సెక్యూరిటీ పట్టించుకోలేదు. దీంతో ఆ దొంగ దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు.

తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మరథాల పేరుతో ఉచిత బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. సెప్టెంబర్‌ 24 తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును గప్ చుప్ గా తీసుకెళ్లాడో దొంగ.. కొండమీద తిరగాల్సిన బస్సు తిరుపతికి వెళుతున్నా అలిపిరి గేటు వద్ద సెక్యూరిటీ పట్టించుకోలేదు. దీంతో ఆ దొంగ దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయింది. ఇక చేసేదేంలేక బస్సును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా దొంగ.. డిపోలో ఉండాల్సిన బస్సు మాయం కావడంతో కొండపై అన్నిచోట్లా గాలించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జీపీఎస్ సాయంతో బస్సును ట్రాక్ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద బస్సును గుర్తించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బస్సును ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..

రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!

రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..

బుడ్డోడి కుకింగ్‌ పాన్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!

 

Follow us on