ఆస్పత్రిలో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు పసికందులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున NICUలో చెలరేగిన మంటల్లో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. ప్రమాద సమయంలో 39 మంది శిశువులు ఉండగా, మరో ఆరుగురిని తీవ్ర గాయాలతో వేరే ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో మిగిలిన 36 మంది శిశువులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ యూనిట్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న NICU వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటిలేటర్ షార్ట్ సర్క్యూట్ లేదా పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో మొత్తం 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రిలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. పసికందుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు శిశువులు దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురు శిశువులను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించడంతో మిగిలిన 36 మంది పసికందులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..
2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!
