TOP 9 ET : ఆరంభమైన ఆస్కార్ సంబంరం.. విమర్శకులకు తారక్ స్ట్రాంగ్ కౌంటర్
95వ అకాడమీ అవార్డ్స్ కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది.
95వ అకాడమీ అవార్డ్స్ కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది. కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి తమ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ గురించి .. తెలుగు సినిమా స్థాయి గురించి అమెరికా మీడియాతో ముచ్చటిస్తున్నారు మన తెలుగు స్టార్స్.