ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..

|

Nov 05, 2023 | 9:44 PM

వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోజు రోజుకీ అడవులు అంతరించిపోతుండటంతో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో అర్ధారాత్రి రెండు పెద్దపులులు రోడ్డుపై స్వైర విహారం చేశాయి. పెన్‌గంగా సరిహద్దులోని తీరం వెంబడి భీంపూర్‌, జైనథ్‌ మండలాల్లో పులులు సంచరిస్తున్నాయి.

వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రోజు రోజుకీ అడవులు అంతరించిపోతుండటంతో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో అర్ధారాత్రి రెండు పెద్దపులులు రోడ్డుపై స్వైర విహారం చేశాయి. పెన్‌గంగా సరిహద్దులోని తీరం వెంబడి భీంపూర్‌, జైనథ్‌ మండలాల్లో పులులు సంచరిస్తున్నాయి. పిప్పల్‌ కోటి, తాంసి(కె) శివారులో పశువులపై దాడికి పాల్పడ్డాయి. హిచరీ సమీపంలో పశువుల మందపై దాడిచేయడంతో 8 పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. రెండు పశువులు మృతి చెందాయి. అర్ధరాత్రి పులులు రోడ్డు దాటుతుండగా గుర్తించిన వాహనదారులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పులుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పారెస్ట్ సిబ్బంది బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సు బీభత్స ఘటనలో ఒకరు దుర్మరణం.. కారు, బైకులు ధ్వంసం

Published on: Nov 05, 2023 09:44 PM