కెమెరామెన్‌కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ కోసం కలిసి పనిచేసిన కెమెరామ్యాన్ వికాస్‌ను స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం చట్టబద్ధం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. రీల్స్ కోసం ఒకే వ్యక్తిని ముగ్గురు యువతులు పెళ్లి చేసుకున్నారు. మీరు విన్నది నిజమే.. అమ్రోహా జిల్లా ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ , సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిత్యం రీల్స్ చేస్తూ నెటిజన్లను అలరించేవారు. వీరి వీడియోలకు శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కీ గత ఆరు నెలలుగా కెమెరామ్యాన్‌గా పనిచేస్తూ, కొన్నిసార్లు రీల్స్‌లో భర్త పాత్ర కూడా పోషించేవాడు. అయితే, కుటుంబ సభ్యులు తమకు వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించడంతో ఈ ముగ్గురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము విడిపోవడం ఇష్టం లేక, ముగ్గురూ కలిసి ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్నయించుకున్నారు. తమ ప్రేమానురాగాలను అర్థం చేసుకున్న కెమెరామ్యాన్ వికాస్‌ను ఒప్పించి, స్థానిక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరంతా మేజర్లు కావడం విశేషం. ఆలయంలో వికాస్ ముగ్గురి నుదుటన బొట్టు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం చెల్లదని, ఇది చట్టరీత్యా నేరమని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ప్రస్తుతం చట్టపరమైన కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

