Telugu Indian Idol 2: అంగరంగ వైభవంగా మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2
ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో ఇండియన్ ఐడల్ తెలుగు ఒకటి. యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది.
ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో ఇండియన్ ఐడల్ తెలుగు ఒకటి. యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. జయంత్, వాగ్దేవి , శ్రీనివాస్, వైష్ణవి , ప్రణతీ లాంటి తెలుగు సింగర్లు ఈ షోలో తమ పాటలతో మెప్పించారు. అయితే చివరకు సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాల్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి సందడి చేశారు. ఇలా తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్ షో సెకండ్ సీజన్ రాబోతుంది. ఇక ఈ సీజన్ లో సింగర్ హేమచంద్ర, గీతామాధురి కూడా యాడ్ అయ్యారు.