AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

Phani CH
|

Updated on: Jul 01, 2026 | 6:56 PM

Share

జనగామ జిల్లా నష్కల్ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు గ్రామ పంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది. ముందస్తు నోటీసులు ఇచ్చినా మద్యం విక్రయాలు ఆపకపోవడంతో ఆరుగురు నిర్వాహకుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇకపై మద్యం అమ్మబోమని బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాతే కరెంట్ పునరుద్ధరిస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.

మద్యపానరహిత గ్రామమే లక్ష్యంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామ సర్పంచ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఊరిలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల నిర్మూలనకు గ్రామ పంచాయతీ తీసుకున్న కఠిన చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నష్కల్ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని గ్రామసభలో పాలకవర్గం ఒక తీర్మానం చేసింది. ఈ క్రమంలో గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఆరుగురికి గ్రామ పంచాయతీ ముందస్తుగా నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, సర్పంచ్ శాతబోయిన రాజు ఆదేశాలతో విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆ ఆరుగురు నిర్వాహకుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చేందుకే గ్రామసభలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ రాజు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా మద్యం విక్రయిస్తే వారికి లభించే అన్ని ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇకపై తాము మద్యం అమ్మబోమని బాండ్ పేపర్ రాసిస్తేనే.. సదరు ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సర్పంచ్ తేల్చి చెప్పారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు నష్కల్ సర్పంచ్ చూపిన ఈ ప్రయత్నం పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!

8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!

బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..

Kailash-Manasarovar Yatra: కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక

Follow Us