అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
దట్టమైన అడవిలో ఆఫీషియల్‌గా తిరగాలని ఉందా? అడవిలో పులులను ప్రత్యక్షంగా చూడాలని ఉందా? అసలు పులులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలని ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రతి వలంటీర్ కూడా అటవీ సిబ్బందితో కలిసి రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడుస్తూ అడవుల్లో పులుల జాడ, అడుగుల ముద్రలు, మల చిహ్నాలు, వాటి నివాస నాణ్యత వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 23వ తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు వేలకు పైగా అటవీ బీట్లలో ఈ పులుల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు, సాధారణ ప్రజలకు వలంటీర్లుగా అవకాశం ఇస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తుల నమోదును మంగళవారం నుంచే ప్రారంభించారు. ఆసక్తిగల వారు ఈ నెల 22 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై మరిన్ని వివరాలకు 1800 425 5364 నెంబర్‌కు కాల్ చేసి లేదా 980999866 నెంబర్ వాట్సాప్‌లో సంప్రదించవచ్చని సూచించారు. లేదంటే aite2026tg@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వలంటీర్లు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు అడవుల్లో నడిచే సామర్థ్యం ఉండాలి. తక్కువ సౌకర్యాలతో, క్యాంపుల్లో అడ్జస్ట్ అవ్వగలగాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు
పాత బ్యాంకు ఖాతాలలో డబ్బు మర్చిపోయారా ?? అయితే ఈ విధంగా చేయండి
సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు
ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు
