తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుండి 16 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా గుర్తించడంతో సెలవులు 7 రోజులకు పొడిగించబడ్డాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇది శుభవార్త.
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త చెప్పింది. విద్యార్ధులకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 16 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. తిరిగి జనవరి 17న శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. నిజానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉన్నప్పటికీ, జనవరి 16న కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గుర్తించింది. జనవరి 16 వరకు సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అకడమిక్ కాలెండర్ ప్రకారం ఆరు రోజులు కాగా.. తాజా ఉత్తర్వులతో మరో అదనపు హాలిడే యాడ్ అవ్వడంతో మొత్తం 7 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు కింద నడిచే పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. పండుగ పూట ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ నిర్ణయంతో ఊరట లభించినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
ఏపీలో రైతులందరికీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు