మేడారంలో ఏఐ డ్రోన్స్‌తో అణువణువు నిఘా.. పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ బ్యాండ్స్
తెలంగాణ ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కొత్త రూపునిచ్చింది. AI ఆధారిత డ్రోన్‌లు, జియో-ట్యాగింగ్, స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్‌ల వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ భద్రతను పటిష్టం చేసింది. 'మేడారం 2.0' వ్యవస్థతో జనసమూహ నియంత్రణ, తప్పిపోయిన వారి గుర్తింపు సులభతరం అయ్యాయి. లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పటిష్టమైన భద్రత కల్పించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
మేడారం రూపు రేఖలు మారాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సమ్మక్క-సారలమ్మల ప్రాంగణానికి కొత్త రూపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వంద రోజుల టార్గెట్ పెట్టుకుని.. మహా జాతరకు ముందే ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించింది. సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులంతా అమ్మవారి ప్రాంగణాన్ని ప్రారంభించి తొలిమొక్కులు చెల్లించుకున్నారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ మేడారంలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. మేడారం జాతర ఈనెల 28న అధికారికంగా మొదలుకాబోతుంది. 31 వరకూ జాతర జరగనుంది. అధికారికంగా జాతర జరిగే నాలుగు రోజులు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతలను పరిరక్షిం చేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత డ్రోన్ వ్యవస్థ, జియో ట్యాగింగ్ ట్రాకింగ్ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు, 12 క్రైం డిటెక్షన్ బృందాల సభ్యులు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. టీజీ క్వెస్ట్ పేరుతో అభివృద్ధి చేసిన ఏఐ ఎనేబుల్డ్ డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్‌ను మేడారం మహాజాతరలో మొదటిసారి వినియోగించనున్నారు. ఈ డ్రోన్లు జన సమూహం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘మేడారం 2.0’గా పిలుచుకునే ఈ వ్యవస్థలో నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎనలిటిక్స్, డ్రోన్ ఆధారిత సర్వేలైన్స్‌లను ఇంటిగ్రేట్ చేశారు. ఇవి జన సమూహంలో ఆకస్మిక రద్దీ, స్టాంపెడ్ ప్రమాదాలను, ట్రాఫిక్ జామ్‌లను, మిస్సింగ్ పర్సన్స్ వంటి సమస్యలను గుర్తించి అలర్ట్ చేస్తాయి. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీగా ఉండే రహదారులపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయి. కేవలం డ్రోన్లే కాకుండా.. ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలను అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. మహాజాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తప్పి పోతే వారి జాడను తెలుసుకునేందుకు వోడా ఫోన్, ఐడియాతో కలిసి పోలీసులు జియో ట్యాగ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టారు. జాతరకు వచ్చే భక్తుల్లో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు పస్రా, తాడ్వాయి మార్గాలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్లు ఇవ్వనున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీని ఇవి వెంటనే కనుగొంటాయి. ఈ విధానం శబరిమలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. జాతరలో శాంతిభద్రతల కోసం ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పాత నేరస్థులను ఇట్టే పసిగట్టవచ్చు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం రెండు వేల ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్‌మెంట్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ
Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో
Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్
Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం
Chiranjeevi: బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్
