iSmart News: నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్లలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నడమే కాకుండా, విత్తనాలు కూడా నాటారు. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి మంత్రి రైతు వేషధారణలో హాజరయ్యారు. బంతి పూలతో అలంకరించిన నాగలిని పట్టి, రైతులతో కలిసి పొన్నం ప్రభాకర్ పొలం దున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని పందిళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. పొలం దున్ని విత్తనాలు నాటే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని రైతులతో మమేకమయ్యారు. వ్యవసాయ పనులకు శుభారంభం పలికే “ఏరొక్క పున్నం” వేడుక సందర్భంగా, మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు మద్దతుగా నిలిచారు. బంతి పూలతో అలంకరించిన నాగలిని పట్టి పొన్నం ప్రభాకర్ పొలం దున్నారు. అలాగే, ఆయన నెత్తికి రుమాలు ధరించి సంప్రదాయ రైతు వేషధారణలో కనిపించారు. ఈ కార్యక్రమం ద్వారా మంత్రి వ్యవసాయ రంగం పట్ల తనకున్న నిబద్ధతను చాటిచెప్పారు. స్థానిక రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Published on: Jun 30, 2026 07:27 PM
Loading...
Unable to load recommendations.
Follow Us