తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

Updated on: Mar 25, 2026 | 8:14 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 10లోపు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 6, 8 లేదా 9న ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. పారదర్శకత కోసం ప్రతి పేపర్‌ను రెండుసార్లు వాల్యుయేషన్ చేస్తున్నారు. రికార్డు సమయంలో లోపరహిత ఫలితాలను అందించడానికి బోర్డు సిద్ధంగా ఉంది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రుల నిరీక్షణకు తెరదించుతూ ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడికి కసరత్తు ముమ్మరం చేసింది. ఏప్రిల్ 10వ తేదీలోపు ఫలితాలను విడుదల చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 3 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక పనులను ముగించి, ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఇంటర్ బోర్డు అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి పేపర్‌ను రెండుసార్లు వాల్యుయేషన్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫలితాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాల్యుయేషన్ విధుల్లో ఉన్న అధ్యాపకులకు రెమ్యునరేషన్ పెంచడంతో పాటు, పని భారాన్ని కూడా తగ్గించారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 25 నుంచి 30 పేపర్లు మాత్రమే దిద్దేలా నిబంధనలు విధించారు. దీనివల్ల పేపర్లను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఎటువంటి వివాదాలకు తావులేకుండా రికార్డు సమయంలో ఫలితాలను ఇచ్చేందుకు బోర్డు సర్వం సిద్ధం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి

గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

Follow Us