AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 4:08 PM

Share

జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన రైతు మహేందర్‌ తాటిచెట్లు ఎక్కడానికి వినూత్న మార్గాన్ని రూపొందించారు. మోకు సాయంతో ఎక్కాల్సిన అవసరం లేకుండా ఐరన్‌ కడ్డీలతో చక్రాల ఆకారంలో మెట్లు ఏర్పాటు చేశారు. మూడు చెట్లకు రూ.30 వేల ఖర్చుతో ఈ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కల్లు తీస్తూ నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు వెల్లడించారు.

తాటిచెట్టు ఎక్కడం, కల్లు గీయడం ఎంత ప్రమాదకరమైన పనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోకు సాయంతో ప్రాణాలను పణంగా పెట్టి చెట్లెక్కి శ్రమించే గీత కార్మికులను రోజూ చూస్తూనే ఉంటాం. అయితే, జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతు తన వినూత్న ఆలోచనతో ఈ కష్టానికి సరికొత్త పరిష్కారం చూపించారు. మహేందర్‌కు ఉన్న మూడు ఎకరాల పొలం చుట్టూ 10కి పైగా తాటిచెట్లు ఉన్నాయి. కానీ, ఆ చెట్లు ఎక్కి కల్లు గీయడానికి ఏ గీత కార్మికుడు ముందుకు రాలేదు. దీంతో తానే స్వయంగా ఆలోచించి, ఓ వెల్డింగ్ షాప్ స్నేహితుడి సాయంతో ఐరన్ కడ్డీలతో తాటిచెట్టు చుట్టూ చక్రాల ఆకారంలో మెట్లను తయారు చేయించారు. ఎలాంటి మోకు అవసరం లేకుండా, ఇళ్లలోని మెట్లు ఎక్కినట్లే కేవలం ఐదు నిమిషాల్లో తాటిచెట్టు పైకి చేరుకునేలా ఈ ఏర్పాటు చేశారు. ఒక్కో చెట్టుకు రూ.10,000 చొప్పున మూడు చెట్లకు రూ.30,000 వెచ్చించి ఈ ఐరన్ మెట్లను అమర్చారు. ఈ విధానం ద్వారా గత మూడేళ్లుగా సునాయాసంగా చెట్లెక్కి కల్లు తీస్తూ, నెలకు సుమారు రూ.60,000 వరకు ఆదాయం పొందుతున్నట్లు మహేందర్ సంతోషం వ్యక్తం చేశారు. అలవోకగా తాటిచెట్టు ఎక్కుతున్న మహేందర్‌ను చూసి స్థానిక గీత కార్మికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడానికి, శ్రమను తగ్గించుకోవడానికి ఈ వినూత్న మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..

రైలు ప్రయాణంలో డైపర్లు అయిపోయాయా? డోంట్ వర్రీ!

ChatGPT లో కీలక మార్పు.. ఇక చాట్‌లోనే గేమ్స్, కాలిక్యులేటర్లు!

Follow Us