Telangana Budget Live: సంక్షేమానికే రేవంత్ సర్కార్ ప్రాధాన్యత.. రూ.3.10 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌.. లైవ్..

|

Mar 19, 2025 | 12:21 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి సుమారు రూ. 3.10 లక్షల కోట్లతో భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్‌ ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. . 3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు.  రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా చూపించారు.  మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క.. రూ. 3.10 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ను రూపొందించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు.

అంతకు ముందు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు. 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రతులకు పూజలు చేశారు. ఆ పూజల అనంతరం ప్రజాభవన్‌ నుంచి అసెంబ్లీకి వచ్చారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

Published on: Mar 19, 2025 11:10 AM