Telangana Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..

Updated on: Dec 29, 2025 | 11:09 AM

Telangana Assembly Winter Session Begins: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. అయితే జాతీయ గీతం పూర్తి కాగానే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. కేవలం మూడు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. ఇక కృష్ణా, గోదావరిపై చర్చకు సిద్ధమయ్యాయి అధికార, విపక్షాలు. జనవరి 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. PPTకి తమకూ అవకాశం ఇవాలని బీఆర్ఎస్‌ కోరుతోంది. ప్రజా సమస్యలపై నిలదీసేందుకు బీజేపీ సైతం సిద్ధమైంది.

శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలను ఇవాళ్టికి రద్దు చేసింది ప్రభుత్వం. దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయిస్తారు.

Published on: Dec 29, 2025 10:52 AM