X Features: ఇకపై వారు.. ట్విట్టర్ ఎక్స్‌లో రిఫ్లై ఇవ్వడం కుదరదు..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్.. అదేనండీ పాత ట్విట్టర్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. రిప్లయ్ విషయంలో యూజర్లకు ఆ సంస్థ మరింత కంట్రోల్ ఇచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసేందుకు గానూ కొత్తగా వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీంతో ఇకపై ఎక్స్‌లో వెరిఫైడ్ కాని యూజర్లు రిప్లయ్ ఇవ్వడం కుదరదు.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్.. అదేనండీ పాత ట్విట్టర్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. రిప్లయ్ విషయంలో యూజర్లకు ఆ సంస్థ మరింత కంట్రోల్ ఇచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసేందుకు గానూ కొత్తగా వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీంతో ఇకపై ఎక్స్‌లో వెరిఫైడ్ కాని యూజర్లు రిప్లయ్ ఇవ్వడం కుదరదు. సాధారణంగా ఎవరైనా ప్రముఖ వ్యక్తి పోస్టు పెడితే.. ఇతరులు కామెంట్ల రూపంలో రిప్లయ్ ఇస్తుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇచ్చేలా ఆప్షన్‌ను ఎంచుకుంటే.. సాధారణ యూజర్లు ఎవరూ ఇకపై రిప్లయ్ ఇవ్వడం సాధ్యపడదు. ఒక విధంగా ఈ ఆప్షన్.. ఎక్స్ యూజర్లను వెరిఫైడ్ అకౌంట్లు వైపు మళ్లించే చర్యగా కనిపిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఆప్షన్ వల్ల ప్రముఖులకు వేధింపులు, ట్రోలింగుల బెడద తగ్గే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ట్విట్టర్ Xలో వెరిఫైడ్ బ్లూ టిక్ పొందాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు నెల నెలా 900 రూపాయలు చెల్లించాల్సిందే. వీరికి పోస్టులు ఎడిట్ చేసుకోవడం, సుదీర్ఘమైన పోస్టులతో పాటు, సుదీర్ఘమైన వీడియోలు సైతం పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..