WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ప్రకనట చేసింది. మెసేజీల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కోరినప్పుడు తొలగించాలంటూ బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢీల్లీ హైకోర్టుకు స్పష్టం చేశాయి. 2021 నాటి ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో గురువారం కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి.
ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ప్రకనట చేసింది. మెసేజీల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కోరినప్పుడు తొలగించాలంటూ బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢీల్లీ హైకోర్టుకు స్పష్టం చేశాయి. 2021 నాటి ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో గురువారం కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి. 2021 ఐటీ మార్గదర్శకాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీల ఎన్‌క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం అప్పట్లో ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఈ నిబంధన పాటించడం కుదరదని వాట్సాప్, మెటా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ సమాచారం కోరుతోందో ముందుగా తెలియదు కాబట్టి తాము ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీ మూలాలు కనిపెట్టేందుకు వీలుగా కోట్లల్లో మెసేజీలను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్