అతిపెద్ద గ్రహాన్ని క‌నుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌..

|

Sep 06, 2022 | 9:07 PM

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్ర‌హాన్ని క‌నుగొంది. సౌర వ్య‌వ‌స్థ ఆవ‌ల ఉన్న ఆ గ్ర‌హం బృహ‌స్ప‌తి క‌న్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్య‌వ‌స్థ అవ‌త‌ల కొత్త గ్ర‌హం చేరిక‌తో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్ర‌హాన్ని క‌నుగొంది. సౌర వ్య‌వ‌స్థ ఆవ‌ల ఉన్న ఆ గ్ర‌హం బృహ‌స్ప‌తి క‌న్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్య‌వ‌స్థ అవ‌త‌ల కొత్త గ్ర‌హం చేరిక‌తో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు సౌర వ్య‌వస్థ బ‌య‌ట ఉన్న గ్ర‌హాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. అయితే ఈ కొత్త గ్ర‌హాన్ని నాలుగు ర‌కాల లైట్ ఫిల్ట‌ర్ల‌లో ప‌రీక్షించారు. చాలా శ‌క్తివంతంగా ఈ గ్ర‌హం వెలిగిపోతోంది. సోలార్ సిస్ట‌మ్ బ‌య‌ట ఎలా ఓ విశిష్ట ప్ర‌దేశం ఉందో ఈ గ్ర‌హాన్ని వీక్షిస్తే తెలుస్తుంద‌న్న అభిప్రాయాన్ని శాస్త్ర‌వేత్త‌లు వ్య‌క్తం చేశారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ క‌నుగొన్న గ్ర‌హాన్ని హెచ్ఐపీ 65426బీగా నామ‌క‌ర‌ణం చేశారు. ఇది జూపిట‌ర్ గ్ర‌హం క‌న్నా సుమారు 12 రెట్లు అధికంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఆ గ్ర‌హం ఏర్ప‌డి దాదాపు 15 నుంచి 20 మిలియ‌న్ల సంవ‌త్స‌రాలు అయి ఉంటుంద‌ని అనుకుంటున్నారు. నాసా త‌న బ్లాగ్‌లో కొత్త ప్లానెట్‌కు సంబంధించిన చిత్రాల‌ను రిలీజ్ చేసింది. వాస్త‌వానికి ఈ గ్ర‌హాన్ని 2017లో తొలిసారి గుర్తించారు. కానీ దానికి గురించి పూర్తిగా తెలుసుకోలేక‌పోయారు. ఇప్పుడు వెబ్‌ టెలిస్కోప్‌తో ఆ ప్లానెట్‌కు చెందిన కొత్త వివ‌రాల‌ను సేక‌రించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..

పంది తెచ్చిన ప్రమాదం.. అరక్షణంలో అంతా జరిగిపోయింది..

Published on: Sep 06, 2022 09:07 PM