VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో

|

Mar 04, 2022 | 8:21 AM

ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు నీటిలో, ఇంకాస్త ఇమ్‌పార్ట్‌టెంట్‌ అనుకుంటే.. గాల్లో, రోడ్డు రయ్‌మంటూ దూసుకెళ్లే వెరైటీ కారు ఉంటే భలే ఉంటుంది కదా.!

ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు నీటిలో, ఇంకాస్త ఇమ్‌పార్ట్‌టెంట్‌ అనుకుంటే.. గాల్లో, రోడ్డు రయ్‌మంటూ దూసుకెళ్లే వెరైటీ కారు ఉంటే భలే ఉంటుంది కదా.! ఇప్పుడు అలాంటి కాన్‌సెప్ట్‌తోనే ఓ కారును రూపొందించింది అమెరికాకు చెందిన వోన్‌మెర్సీన్‌ సంస్థ. అత్యాధునిక డిజైన్‌తో పాటు యుద్ధ విమానాల్లాంటి జెట్‌ స్పీడ్‌తో గాల్లో ఎగరగలది, రోడ్డుపై స్పోర్ట్స్‌ కార్‌ల రయ్‌మంటూ దూసుకెళ్లే కారును రెడీ చేశారు అరోసా నీటిపైనా, నేలపైనా సుమారు ఏడు అంగుళాల ఎత్తులో ఎగురుతూ.. గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో.. 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయణించగలదు. ఇందులో పెట్రోల్‌ జనరేటర్‌ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌తో రోటార్‌ ఫ్యాన్లు తిరుగుతాయని.. ఈ తరహా ఎలక్ట్రిక్‌ హోవర్‌క్రాఫ్ట్‌ ప్రపంచంలోనే మొదటిదని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే దీన్ని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. ఇంతకీ దీని ధరెంతో చెప్పలేదు కదా.. జస్ట్‌ 75 లక్షలేనట.

Also Watch:

Prabhas: పెళ్లిపై ప్రభాస్‌ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో