AIకి చెక్ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్
కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. AI వల్ల మానవాళికి ముప్పు, రోబోలు ప్రపంచాన్ని ఆక్రమిస్తాయనే భయాలను ఆయన బూటకపు ప్రచారంగా అభివర్ణించారు. అమెరికా AI అభివృద్ధిని ఆపితే చైనాకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మరోవైపు బిల్ గేట్స్ సహా పలువురు టెక్ నిపుణులు AI వేగం, నియంత్రణపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ టెక్నాలజీని నియంత్రించకపోతే యమడేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అది భస్మాసురహస్తమవుతుందని చెబుతున్నారు. కాని ట్రంప్ మాత్రం ఇదంతా చైనా కుట్ర అని అంటున్నారు. చైనాపై ఎట్టి పరిపరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి అని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీపై నిపుణులది ఓ మాట.. ట్రంప్‌ది మరోమాట.. రానున్న కాలంలో కృత్రిమ మేధకు చెక్ పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని ట్రంప్ అంటున్నారు. అమెరికా వ్యతిరేక శక్తులే తప్పుడు ప్రచారం చేస్తున్నామయని మండిపడ్డారు. ఊహజనితమైన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరముందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఏఐ టెక్నాలజీపై తీవ్ర ఆందోళన వ్యక్తం లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ‘ఆల్-ఇన్ సమిట్’ లైవ్ ఈవెంట్ వేదికపై ఉండగా ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం సంచలనం రేపింది. స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలోనే ఈ కాల్ రావడంతో, హువాంగ్ ఆ ఫోన్‌ను స్పీకర్ ఆన్ చేసి అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు, టెక్ నిపుణులకు వినిపించారు. ఏఐ భయాలు ఒక ‘బూటకం’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు ఉందనే ఆందోళనలను, రోబోలు ప్రపంచాన్ని ఆక్రమిస్తాయనే వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. ఇదంతా ఒక బూటకపు ప్రచారమని ఆరోపించారు. . అమెరికాలో ఏఐ అభివృద్ధి వేగాన్ని ఆపితే అది చైనాకు లాభం చేకూరుస్తుందని, ఆ దేశం దీనివల్ల చాలా సంతోషిస్తుందని ట్రంప్ మండిపడ్డారు. ఏఐపై కుట్ర జరగుతోంది. దీని వెనుక చైనా కుట్ర ఉంది. చాలా రాష్ట్రాలు సంతోషంగా ఉన్నాయి. ఫిన్లాండ్‌లో డేటా సెంటర్లకు అనుమతి లభించడం లేదని తప్పుడు ప్రచారం జరుగుతోంది. అంతా కుట్ర. డేటా సెంటర్లతో చాలా లాభం ఉంది. రానున్న 25 ఏళ్లలో ఇదే పెద్ద వ్యాపారంగా అవతరించబోతోంది చైనాకు లాభం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాని నేను దానిని అడ్డుకుంటా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో దీని వాడకం ఎక్కువైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ విపరీతంగా అభివృద్ధి చెందుతోందని టెక్ నిపుణులు, దిగ్గజ సంస్థల సీఈఓలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ మానవ మేధస్సును దాటి, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే వేగం ఉంటే 12 నెలల్లోపు ఏఐ పూర్తిగా ఇంటర్నెట్‌నే తన అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏఐ టెక్నాలజీ ప్రస్తుతం పెనుమార్పులకు లోనవుతోంది. ఏఐ వ్యవస్థలు తమంతట తామే తమ సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకునే దిశగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యింది. . ఇది ఏమాత్రం నియంత్రణ లేకుండా కొనసాగితే వాటిని అర్థం చేసుకోవడం, నియంత్రించడం మానవులకు కష్టంగా మారొచ్చని హెచ్చరికలు వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు తాము చేయాల్సిన పనికి ఏ మాత్రం సంబంధం లేని సైబర్ సెక్యూరిటీ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, తమ సామర్థ్యాన్ని పరీక్షించే గ్రేడర్‌ను హ్యాక్ చేసేందుకు కూడా ప్రయత్నించించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!